ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో.. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత - పశ్చిమగోదావరి జిల్లా ముఖ్యవార్తలు

పశ్చిమగోదావరి జిల్లా సోమవరప్పాడులోని ఓ రైస్​మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. 27.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

సోమవరప్పాడులో రేషన్ బియ్యం పట్టివేత
సోమవరప్పాడులో రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Oct 13, 2021, 2:39 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు ఓ రైస్​మిల్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు, తహసీల్దార్ రవికుమార్.. శ్రీలక్ష్మీ హనుమాన్ రైస్​మిల్ లో తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో.. అక్రమంగా నిల్వ ఉంచిన 27.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్నిసివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. గతంలోనూ.. ఇదే రైస్ మిల్​లో రేషన్ బియ్యాన్ని దెందులూరు పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మిల్ నుంచి కాకినాడ పోర్ట్ కు తరలించి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

Srisailam: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.