ETV Bharat / state

ఏలూరులో మరో 46 మందికి అస్వస్థత.. 300 దాటిన బాధితుల సంఖ్య..! - ఏలూరు తాజా వార్తలు

Victims are joining at Eluru Government Hospital
అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న బాధితులు
author img

By

Published : Dec 6, 2020, 9:53 AM IST

Updated : Dec 6, 2020, 3:14 PM IST

09:48 December 06

ఏలూరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు

అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న బాధితులు

అంతుచిక్కని అస్వస్థతతో ఏలూరులో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే.. వారిలో చాలామంది ఇప్పటికే డిశ్చార్జయ్యారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుండగా... పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని విజయవాడ తరలించారు. ఆదివారం 46 మంది బాధితులు వైద్యులను ఆశ్రయించారు. మొత్తం  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 300పైగా ఉంది.  ఏలూరు పడమర వీధి, దక్షిణం వీధి, కొత్తపేట, శనివారపు పేట, ఆదివారపు పేట నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కళ్లు తిరగడం, మూర్ఛ లాంటి లక్షణాలతో బాధితులు సతమతమవుతున్నారు. అయితే... చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ శిబిరాలతో పాటు... ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

శనివారం అస్వస్థతకు గురైన 100మంది

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం ఉన్నట్టుండి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని అంబులెన్సుల్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 95 మంది ఇదే రకమైన అస్వస్థతతో వచ్చారని ఏలూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ చెప్పారు. ఇవాళ తాజాగా మరో 46 మంది వైద్యులను ఆశ్రయించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో 60 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత

Last Updated : Dec 6, 2020, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.