కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు 50 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించారు. సుమారు రూ.40 లక్షల విలవైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. వేలివెన్ను గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు శిరిగిన చైతన్య, బూరుగుపల్లి యోగేంద్ర, ఈర్పిన శ్రీనివాస్, మద్దిపాటి రామకృష్ణ బూరుగుపల్లి రామకృష్ణ, వాకలపూడి వినోద్ కుమార్, దుద్దుపూడి వెంకటనారాయణ తదితరులు ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఇచ్చారు.
ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులకు ఉచితంగా అందిస్తామని అన్నారు. కాన్సన్‌ట్రేటర్ల పంపిణీకి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు ఎన్నారై ప్రతినిధి సందీప్ తెలిపారు.
ఇదీ చదవండి: