పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వారాల పండుగను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి అనంతరం వచ్చే మొదటి ఆదివారం ఈ పండుగను జరుపుకుంటారు. పోతునూరు, ఉండ్రాజవరం తదితర గ్రామాల్లో ఉదయం నుంచి...గంగానమ్మ, కనకదుర్గ, పెద్దింట్లమ్మ, మహాలక్ష్మి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దెందులూరులో మహిళలు బృందాలుగా ఏర్పడి డప్పు వాయిద్యాలతో పాదయాత్రగా వెళ్లి ఆలయాలను సందర్శించారు. బంధువులు, స్నేహితులతో ఆయా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి-జై జై గణేశా...జై కొడతా గణేశా....