పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకుల ఇల్లిందలపర్రు గ్రామంలో దివంగత నేత వంగవీటి రంగా విగ్రహం నెలకొల్పారు. ఆ విగ్రహాన్ని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆవిష్కరించారు.
వంగవీటి రంగా రాష్ట్రంలో ఒక ప్రాంతానికే పరిమితం కాక రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారని ఆయన కొనియాడారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో కాపు కల్యాణమండప నిర్మాణానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంక రవీంద్ర, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జల వనరుల పరిరక్షణ కోసం.. "జల సంరక్షణే జన సంరక్షణ"