ETV Bharat / state

నిరుపయోగంగా వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు.. వాటికి కేటాయిస్తే మేలు! - వృధాగా వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు తాజా వార్తలు

పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం నిర్మించిన వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుడా నిధులతో వీటిని నిర్మించారు. ఉద్దేశం మంచిదే అయినా, రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కేంద్రాలు వృథాగా ఉన్నాయి. ఫలితంగా అనుకున్న లక్ష్యం నెరవేరక నిరుపయోగంగా మారాయి.

unused ysr reception centers
నిరుపయోగంగా వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు
author img

By

Published : Dec 1, 2020, 11:55 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రజలు ప్రతి సోమవారం తమ సమస్యలను తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పిస్తే మీ సమస్యలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వాటిని పరిష్కరిస్తారని తెలిపింది. ప్రజలు ఎంతో ఆశతో తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్దకు వందల సంఖ్యలో వినతులు ఇవ్వడానికి వచ్చేవారు. ప్రజల తాకిడికి కార్యాలయాల్లో సిబ్బంది విధులు నిర్వహించుకోడానికి ఇబ్బందిపడేవారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే తుడా నిధులతో ప్రజలు వేచి ఉండడానికి వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

ఒక్కో కేంద్రానికి రూ.7 లక్షలు

ఒక్కో కేంద్రానికి తుడా నిధులు రూ.7 లక్షలు కేటాయించారు. ఇవి పూర్తయిన తర్వాత వీటిని ప్రజా అవసరాలకు ఉపయోగించకుండా, పస్తుతం వీటికి తాళాలు వేశారు. ఏడాది కావస్తున్నా వీటిని ఇంతవరకు ప్రజా అవసరాలకు వినియోగించకపోవడం గమనార్హం. పంచాయతీల్లో సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ సమస్యలను స్థానికంగా సచివాలయాల్లోనే ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీనికితోడు కరోనా రావడంతో ప్రజలు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలకు రావడం తగ్గించేశారు.

ఆధార్‌ కేంద్రాలకు వినియోగిస్తే:

ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌ సేవలు మూడు వారాలకు ముందు నిలిపివేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్దే ప్రజలకు అందుబాటులో ఉండేట్టు ఆధార్‌ సేవలు అందించాలని, మీ సేవ కేంద్రాలకు సూచించింది. దీనికి సమ్మతిస్తూ జిల్లాలోని 42 మంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు తమకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గది ఏర్పాటు చేస్తే మేము ఆధార్‌ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సదరు కార్యాలయాల వద్ద ఖాళీ గదులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్‌ సేవలు ఇంతవరకు ప్రారంభించలేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఆధార్‌ సేవలకు ఈ రిసెప్షన్‌ కేంద్రాలను కేటాయిస్తే మంచిదని పలువురు చెబుతున్నారు.

ప్రజా అవసరాలకు వినియోగించాలి

వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు ప్రజలు వేచి ఉండడానికి నిర్మించాం. వీటిని సంబంధిత తహసీల్దార్‌, ఎంపీడీవోకు అందించాం. వాటిని ప్రజల అవసరార్థం వినియోగించాలని తుడా కార్యనిర్వాహక ఇంజినీరు వరదారెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

మళ్లీ కేంద్ర జలసంఘం పరిశీలనకు పోలవరం ఖర్చు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.