ఉండి కేవీకేలో మహా వనమహోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో మహావన మహోత్సవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచాలని కేవీకే ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు సూచించారు. కళాశాల విద్యార్థులకు నిర్వాహకులు, రైతులు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉండి కేవీకేలో రైతులు, విద్యార్థులతో మొక్కలు నాటించారు. అనంతరం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి :
కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు..మార్గదర్శకాలు జారీ