కరోనా వైరస్ విజృంభణతో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని 15 గ్రామాల్లో అధికారులు పూర్తి బంద్కు పిలుపునిచ్చారు. ఈ కారణంగా మండల గ్రామాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలు తప్ప మిగిలిన అన్ని షాపులు మూతబడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన గ్రామాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితులు పెరుగుతుండటం వల్ల బంద్కు పిలుపునిచ్చామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :