ఏకగ్రీవం అయితే పెద్దఎత్తున ప్రోత్సాహక నిధులు వస్తాయని.. వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని నాయకులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కువ మంది పోటీకే మొగ్గు చూపారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని.. కానీ నిబంధనలకు విరుద్ధంగా జరిగితే మాత్రం తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో నాయకులు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నచోట్ల మాత్రమే ఏకగ్రీవాలపై దృష్టి పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో 70 ఏకగ్రీవాలు కాగా..ఇప్పుడు 41 మాత్రమే ఏరగ్రీవ ఖాతాల్లో గ్రామాలు స్థానం సంపాదించాయి.
ఇదీ చూడండి: భవన యజమానిని ప్రశ్నించినందుకే..!