ETV Bharat / state

పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు - పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు దొంగలు అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 207 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆకుల రఘు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ
వివరాలు వెల్లడిస్తున్న సీఐ
author img

By

Published : Nov 2, 2020, 8:20 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఆకుల రఘు పేర్కొన్నారు. రాజమండ్రి కోటిలింగాల రేవుకు చెందిన కె.సత్తిబాబు... తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, గుడివాడ, తణుకు ప్రాంతాల్లో ఇంటి దొంగతనానికి పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. సత్తిబాబు పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.

మరొక కేసులో కందుల యేసురాజు అనే వ్యక్తి జిల్లాలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడని సీఐ వెల్లడించారు. ఇరువురు నుంచి 207 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ చెప్పారు.

ఇదీచదవండి

'పంట నష్టానికి పరిహారం చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.