పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నలుగురు మార్టేరులోని ఒక కాంప్లెక్సులో మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ నలుగురిలో నల్లి కిషోర్, నల్లి సంపత్‌రావు అనే ఇద్దరు అస్వస్థతకు గురై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పార్టీలో మద్యం తాగి, చికెన్ తిన్నట్లు తెలిసింది. కిషోర్, సంపత్‌రావులు గంటల వ్యవధిలో మృతిచెందడం వల్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు కిషోర్ భార్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఎస్సై రమేశ్ తెలిపారు.
ఇదీ చూడండి: