ETV Bharat / state

నిడమర్రు మండలంలో కరోనా సోకి ఇద్దరు మృతి - నిడమర్రు మండలంలో కరోనా సోకి ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలో కరోనా సోకి ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనారోగ్యంతో బాధితులు ఆర్​ఎంపీ వైద్యలను సంప్రదించగా... ఆరోగ్యం మెరుగవకపోవటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితులు మరణించగా..తర్వాత వచ్చిన ఫలితాల్లో వారికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

నిడమర్రు మండలంలో కరోనా సోకి ఇద్దరు మృతి !

author img

By

Published : Jul 7, 2020, 3:54 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం భువనపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాధితుడు కొన్ని రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతూ... స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు వద్ద చికిత్స తీసుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవకపోవటంతో ఈ నెల 4న పెదనిండ్రకొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుభాకర్ వైద్య పరీక్షలు చేశారు. చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు నమూనాల ఫలితాలు రాకుండానే అతను ఈ నెల 5న మరణించాడు.

తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. బాధితుడు గణపవరంలోని ఐరన్ షాప్​లో పని చేసేవాడు. దీంతో రెండు గ్రామాలలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 28న ఆదివారం ప్రార్ధన నిమిత్తం చర్చికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇదే మండలంలో చిన్న నిండ్రకొలను (పత్తేపురం) గ్రామానికి చెందిన మరో వ్యక్తి...అనారోగ్యం పాలవడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు దగ్గర చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. అతను ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అనుమానంతో ఏలూరు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించి అతను మరణించాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అనారోగ్యం పాలైతే ఆర్ఎంపీ, పీఎంపీ, సొంత వైద్యాలపై ఆధారపడకుండా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.