క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన గురువెల్లి నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ అనే వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని బెట్టింగ్ స్థావరంపై.. చేబ్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 3,900 రూపాయల నగదు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వీర్రాజు తెలిపారు తెలిపారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: పశ్చిమ గోదావరి ప్రభుత్వ పాఠశాల్లో కరోనా కలకలం...