ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలను అమలు చేస్తున్నారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన... ఆరు నెలల పరిపాలన కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని తెలిపారు. అనర్హుల రేషన్ కార్డులు తీసివేస్తామే గానీ.. అర్హులైన వారి కార్డులను తీసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. తొలుత వేల్పూర్ రోడ్డు నుంచి సభా వేదిక వద్దకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రథసారధిగా జోడు గుర్రాల రథంపై అతన్ని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం భారీ గజమాల, నూతన పట్టు వస్త్రాలతో సత్కరించారు.
ఇదీ చూడండి: సాఫ్ట్‌వేర్ సుబ్రమణ్యం.. ఆదర్శ వ్యవసాయం