పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మండలాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని... జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా చేశారు. పదేళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నా... వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపించారు. వచ్చే ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలతో పాటు...సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: