పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టిడ్కో ఇళ్ల కేటాయింపు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు శనివారం పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తణుకు పట్టణ పరిధిలో అజ్జరం కాలనీ సమీపంలో 900పైగా టిడ్కో గృహాలను నిర్మించారు. అప్పట్లో గృహ నిర్మాణాలు పూర్తికాకపోవటంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. తాజాగా లబ్ధిదారులు ఆందోళన బాట పట్టటంతో ఎట్టకేలకు కేటాయింపు పత్రాలను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పంపిణీ
చేశారు.
సుమారు 60 మంది లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులందరికీ త్వరలోనే కేటాయింపు పత్రాలు ఇస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను లబ్ధిదారులు దగ్గరుండి పూర్తి చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి