పశ్చిమగోదావరి జిల్లా వెలగపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఈనెల 9న జరిగిన హత్య కేసును గణపవరం పోలీసులు ఛేదించారు. ఆరు నెలల క్రితం ఉత్సవాల్లో జరిగిన గొడవే..హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉండి మండలం ఆరేడుకు చెందిన సోలోమన్ రాజు వెలగపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఏడేళ్లుగా వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే విధులకు హాజరైన సోలోమన్ రాజును ఈ నెల 9న గుర్తు తెలియని వ్యక్తులు రాడ్డులతో బలంగా కొట్టి హతమార్చారు. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు ఉండి మండలం ఆరేడు గ్రామానికి చెందిన డొల్లా స్టీవెన్ సన్, దానం సురేంద్ర, ప్రత్తిపాటి దావీదు రాజుగా గుర్తించారు.
కక్ష పెంచుకొని...
ఆరు నెలల క్రితం ఆరేడు గ్రామంలో జరిగిన ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో అదే గ్రామానికి చెందిన డొల్లా స్టీవెన్ సన్, దానం సురేంద్ర, ప్రత్తిపాటి దావీదు రాజులకు, సరిపల్లెకు చెందిన యువకుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు మృతుడు సోలోమన్ రాజు, మరి కొంతమంది పెద్ద మనుషులు నిందితులను గట్టిగా మందలించారు. అప్పటి నుంచి సోలోమన్ రాజుపై కక్ష పెంచుకున్న ముగ్గురు నిందితులు పథకం ప్రకారం హత్య చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇదీచదవండి
గుంటూరులోని ఆలయంలో చోరీ...కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు