ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించనున్న ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనేందుకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు (పదో తరగతి) ఎంపికయ్యారు. పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థినులు తాళ్ల నిఖితారామ్, రాపాక శ్రావణి, భోగాపురంలోని విజ్ఞాన్ గ్రీన్ ఫీల్డ్ పాఠశాల విద్యార్థి వై.మోహన్ ఫణీంద్ర ఎంపికైనట్లు డీఈవో రేణుక తెలిపారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధానమంత్రి బుధవారం రాత్రి 7 గంటలకు టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా సంభాషిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇళ్ల నుంచే https://education.gov.in, youtube.com/my govindia (టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా) ద్వారా వీక్షించవచ్చన్నారు.
ఇదీ చదవండి: