పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై.జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
అంబులెన్స్ డ్రైవర్ మద్యం మత్తులో తమ కారును ఢీకొట్టారని... కారులో ప్రయాణిస్తోన్న ప్రయాణికులు తెలిపారు. అంబులెన్స్ లోపల తనిఖీ చేయగా డ్రైవర్ సీటు కింద మద్యం సీసా దొరికిందన్నారు. విశాఖ జిల్లా నుంచి గుంటూరు జిల్లా వెళ్తోన్న కారును... ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్తోన్న ప్రైవేట్ అంబులెన్స్ ఢీ కొట్టింది.
ఇదీ చూడండి: భూవివాదం: పోలీసులకు, గిరిజనులకు మధ్య ఉద్రిక్తత