ETV Bharat / state

జగన్ మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యత - west godavari

సీఎం జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు అవకాశమిచ్చారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది.

జగన్ మంత్రివర్గం
author img

By

Published : Jun 8, 2019, 6:37 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచిన... ఆళ్ల నానికి జగన్ జట్టులో చోటుదక్కింది. 1970 డిసెంబర్ 29న దెందులూరు మండలం టెక్కనవారిగూడెంలో నాని జన్మించారు. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. బీకాం చదువుకున్న ఆళ్ల నాని... ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012 ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గెలిచారు. తాజా ఎన్నికల్లో గెలుపొంది... జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.

చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఉండి మండలం ఎండగండిలో 1953 సెప్టెంబర్ 19న జన్మించిన శ్రీరంగనాథరాజు... ఇంటర్ వరకు చదువుకున్నారు. 2004 అత్తిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా వైకాపా తరపున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా రైసు మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.

చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నియోజకవర్గం: ఆచంట
వయస్సు: 66
విద్యార్హత: ఇంటర్మీడియట్
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనిత... జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2009లో గోపాలపురం నుంచి పోటీచేసి... తొలిసారి విజయం సాధించిన వనిత... వైకాపా ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది... కేబినెట్​లో చోటు దక్కించుకున్నారు.

తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ

Latehar (Jharkhand), Jun 07 (ANI): 65-year-old Ramcharan Munda allegedly died from starvation in Jharkhand's Latehar yesterday. The deceased family alleged that they could not get ration because the electronic machine used for biometric-based ration delivery wasn't working due to a network issue.Speaking to ANI, Munda's daughter said, ''We haven't received ration since past 3 months. He hadn't eaten anything in the last 3 days." However, Sub-Divisional Magistrate (SDM) Sudhir Kumar has rejected the charges. He said, "It hasn't yet been proved that he died from starvation. He was provided all benefits like Ayushman Bharat Yojana, Ration card, pension. There is no internet connection here, so we are now working on offline distribution."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.