పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయిని ఇంట ఏడాది కాలంలో ముగ్గురు పెద్దలను మహమ్మారి బలిగొంది. కవల పిల్లలను అనాథలను చేసింది. తాళ్లకట్టుపల్లికి చెందిన నాగదుర్గ కుక్కునూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని. ఆమె భర్త రమేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగి. వీరికి పెళ్లైన చాలా ఏళ్లకు కవలలు నిఖిల్, నిహాల్ పుట్టారు. గతేడాది రమేశ్ తల్లి కరోనాతో మరణించింది. తర్వాత నాలుగు రోజులకే రమేశ్‌నూ మహమ్మారి కాటేసింది. అత్త, భర్త మృతితో కలత చెందిన నాగదుర్గ బుట్టాయగూడెం నుంచి కుక్కునూరుకు మకాం మార్చి ఇక్కడే ఉంటున్నారు. పిల్లలిద్దరూ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇటీవల నాగదుర్గ కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.
ఇదీ చదవండీ... సెంకడ్ వేవ్: పూల వ్యాపారులను దెబ్బకొట్టిన కరోనా