జిల్లాలోని పాలంగి గ్రామం వద్ద పులవర్తి లీలాసాయిగుప్త అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 96 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి వస్తువులు, చరవాణి, మూడు వేల రూపాయల నగదును తణుకు గ్రామీణ, ఉండ్రాజవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం నిర్వహించుకునే ఇతను ఎవరు లేని సమయాల్లో చోరీలు చేస్తాడు. తణుకు గ్రామీణ వెంకటరాయపురం, పాలంగి, కర్రావారి సావరం గ్రామాలలో నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.
ఇదిచూడండి.రూ.250కే 'నెట్ఫ్లిక్స్' సభ్యత్వం!