రెవెన్యూ శాఖలో ఫీల్డ్ సిబ్బందిగా అన్నిశాఖలతో సమన్వయం చేసుకుంటూ..64 రకాల విధులను వీఆర్వోలు నిర్వహిస్తున్నారని...వారికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని నర్సాపురం సబ్‌కలెక్టర్‌ను ఏపీ వీఆర్వో సంఘ నాయకులు వాసిరెడ్డి ఏసుబాబు, కేవీవీ సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. లేకపోతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసే విధానాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి జాబ్ చార్ట్ ప్రకారం అన్ని సేవలను సచివాలయం నుంచే చేస్తున్నామని... వాటిలో 90 శాతం సేవలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నావన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, కరోనా కష్ట కాలంలో వీఆర్వోలు ఉత్తమ సేవలు అందించారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ప్రక్రియలో, వివిధ సంక్షేమ పథకాలకు అవసరమైన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించడంలో వీఆర్వోలు కీలకంగా సేవలు అందిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 30న రైతు సంఘాల ఆధ్వర్యంలో 'చలో శ్రీకాకుళం'