పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లిలోని చేపల చెరువుకు రక్షణ కంచెగా ఏర్పాటు చేసిన వలలో రెండు కొండ చిలువలు చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన సర్ప రక్షకుడు ఈశ్వరరావు సమాచారం అందుకుని కొండ చిలువలను వల నుంచి విడిపించారు.
ఏడాది వయసున్న ఆ పాములు.. 11 నుంచి 12 అడుగుల పొడవుతో 25 కిలోల చొప్పున బరువు ఉన్నాయని ఈశ్వరరావు తెలిపారు. వాటిని వణ్యప్రాణి విభాగం వైద్యాధికారులు పరీక్షించారు. త్వరలోనే అటవీ ప్రాంతంలో వదులుతామని తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల పాముల్ని తాను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టానని ఈశ్వరరావు చెప్పారు.
ఇదీ చదవండి: