ఇదీ చదవండి
"వైకాపా ప్రభుత్వ నిర్ణయాలతో దేశానికే చెడ్డ పేరు" - polavaram
వైకాపా ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుందని భాజపా ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. పీపీఏలపై పునఃసమీక్ష వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. పోలవరం పనులు ఎంత శాతం పూర్తయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సుజనా చౌదరి
నాలుగు నెలల వైకాపా ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల విషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ గతంలో ఎందుకు రేటు తగ్గించి టెండర్ వేసిందని ప్రశ్నించారు. పీపీఏల రద్దు వల్ల ఏపీకి కొత్తగా పరిశ్రమలు రాకపోవడమే కాకుండా దేశానికే చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. వైఎస్ హయాంలో భూసేకరణ పూర్తయితే ఇంత సాగదీత ఉండేదికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కల్పనలోనూ వైకాపా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏపీని పార్టీలు, కులాలు, మతాలుగా విభజించి పరిపాలన చేస్తారా అని నిలదీశారు. ఏపీని లా లెస్(న్యాయంలేని) రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంటి చుట్టే రాజకీయం అంతా తిప్పడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే అన్నట్టు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Intro:AP_NLR_05_25_TEACHER_DHARANA_RAJA_AVB_AP10134
anc
సిపిఎస్ రద్దు విధానాన్ని రద్దు చేయాలంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు .అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖల బదిలీలు చేపట్టి ఉపాధ్యాయుల బదిలీల ఆపడం మంచి పద్ధతి కాదన్నారు. దసరా సెలవుల్లో నైనా ఉపాధ్యాయుల బదిలీలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
బైట్ ,ఉదయ భాస్కర్ , ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా
Body: ధర్నా
Conclusion: రాజా నెల్లూరు 9394450293

Last Updated : Sep 25, 2019, 4:46 PM IST