పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన దుర్గ అనే 20 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందింది. 25వ తేదీ ఉదయం కర్మాగారంలో పనికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
బంధువుల ఇళ్లల్లో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. యువతి తండ్రి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన సాయి కృష్ణ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. తణుకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం..49 మందికి ధిక్కరణ నోటీసులు