ETV Bharat / state

సాంకేతికతకు విద్యార్థులే సారథులు: డీఆర్​డీవో ఛైర్మన్ - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌ 2,3 స్నాతకోత్సవాలు శనివారం నిర్వహించారు. 2016-20, 2017-21 విద్యా సంవత్సరాలకు సంబంధించిన 793 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. స్నాత కోత్సవాన్ని నిట్‌ పాలకమండలి అధ్యక్షురాలు మృదులా రమేష్‌ ప్రారంభించారు. డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలుత ప్రసంగించారు.

డీఆర్​డీవో ఛైర్మన్
డీఆర్​డీవో ఛైర్మన్
author img

By

Published : Nov 14, 2021, 1:04 PM IST

విద్యార్థులే సాంకేతికతకు సారథుల ని వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెంలోని నిట్‌ 2,3 స్నాతకోత్సవాలు శనివారం నిర్వహించారు. 2016-20, 2017-21 విద్యా సంవత్సరాలకు సంబంధించిన 793 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. స్నాత కోత్సవాన్ని నిట్‌ పాలకమండలి అధ్యక్షురాలు మృదులా రమేష్‌ ప్రారంభించారు. డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలుత ప్రసంగించారు.నిట్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ సాగిన పరిణామాలు, అభివృద్ధి, క్యాంపస్‌ ఇంటర్య్వూలు, కొత్త కోర్సులు తదితర అంశాల గురించి వివరించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన కార్తీక్‌రెడ్డి 2016-20లో, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన బి.అనూష 2017-21లో టాపర్లుగా నిలిచారు. వీరితోపాటు రెండు విద్యాసంవత్సరాల్లో వారి విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులకు సతీష్‌రెడ్డి బంగారు పతకాలు అందించారు. అనంతరం అతిథులు ప్రసంగించారు.

ప్రత్యేక దుస్తులతో హాజరై విద్యార్థులు అందరి దృష్టీ ఆకర్షించారు.

2020 బ్యాచ్‌ ఆకు పచ్చ, 2021 బ్యాచ్‌ కాషాయ రంగు ధరించారు

మా పిల్లలు బంగారు కొండలు

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే : ‘ప్రతిష్ఠాత్మక నిట్‌లో చదవటం, కోర్సులవారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రముఖుల నుంచి మా పిల్లలు బంగారు పతకాలు అందుకోవటం గొప్ప విషయం. ఈ అపురూప ఘట్టాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం’ అని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.తమ బిడ్డలు సాధించిన విజయాన్ని చూసి వారు మురిసిపోయారు. నిట్‌ స్నాతకోత్సవానికి వచ్చిన పలువురిని ‘న్యూస్‌టుడే’ పలకరించగా తమ పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కరోనాతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఆ ప్రభావం నిట్‌పై పడ నీయలేదు. విరామం లేకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాం. 2020లోనే మొదటి ఎంటెక్‌ బ్యాచ్‌ విద్యార్థులకు వర్చువల తరగతులు నిర్వహించాం. కొత్త భవనాలు నిర్మించాం. వచ్చే నాలుగేళ్లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. - సీఎస్‌పీరావు, నిట్‌ డైరెక్టర్‌

కేంద్ర ప్రభుత్వం దేశీయ వ్యవస్థాపక సంస్థలను స్థాపించి, ఉద్యోగాలు సృష్టించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వాటిని యువత ఉపయోగించుకోవాలి. తద్వారా నూతన ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయి. రెండేళ్ల క్రితం నిట్‌కి వచ్చాను. అప్పటికీి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అద్భుతంగా తీర్చి దిద్దారు. - దశరథరామ్‌ యాదవ్‌, డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌

ప్రతి వ్యక్తీ తమలోని బలాబలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా వాటికి అనుగుణంగా ముందుకు వెళ్లడం అలవరుచుకోవాలి. - మృదులారమేష్‌, నిట్‌ పాలక మండలి అధ్యక్షురాలు

గర్వంగా ఉంది.. మా అమ్మాయి కోట పూర్ణ వింద్య. సివిల్‌ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది. ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు హైదరాబాద్‌ నుంచి మేము కుటుంబ సమేతంగా వచ్చాం. నేను సాధించలేని విజయాన్ని నా కూతురు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. - సాయి శ్రీనివాస్‌, విద్యార్థిని తండ్రి

మధురక్షణాలు.. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మా యి దాసరి వెంకట సాయి జ్యోత్స్న. ఈసీఈ విభాగంలో బంగారు పతకాన్ని అందుకున్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ఈ మధురానుభూతులను ఆస్వాదించేందుకు సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న నేను మంగళగిరి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వచ్ఛా జ్యోత్స్య చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి తన కల సాకారం చేసుకుంది. చిన్నమ్మాయి లక్ష్మీరుతిక విజయవాడలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. - కృష్ణమోహన్‌

తీరికచేసుకొని.. నేను డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నా. మాఅమ్మాయి పి.యశోద నాగలక్షి కిరణ్మయి బయోటెక్నాలజీ లో మొదటి స్థానం సాధించింది. తను బంగారు పతకాన్ని అందుకోవడాన్ని చూడాలని .. తీరిక చేసుకొని కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరం నుంచి వచ్ఛా ఆమె విజయంతో ఎంతగానో గర్విస్తున్నా. - పి.సుబ్రహ్మణ్యం

ఇదీ చదవండి:

తెదేపా అభ్యర్థి భర్త అరెస్ట్.. పీఎస్​ ఎదుట కోటంరెడ్డి ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.