ETV Bharat / state

Tension: పాదయాత్రలో టెన్షన్​.. అమరావతికి వ్యతిరేకంగా వైకాపా ప్లకార్డులు

Tension in Amaravati farmers Padayatra: 30వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు... ప్లకార్డులు, నల్లజెండాలు, నల్ల బెలూన్లతో నినాదాలు చేశారు. దీంతో ఐతంపూడిలో పోలీసులు భారీగా మోహరించారు.

Tension
మహాపాదయాత్రలో ఉద్రిక్తత
author img

By

Published : Oct 11, 2022, 4:05 PM IST

Updated : Oct 11, 2022, 5:08 PM IST

Tension in Amaravati farmers Padayatra: అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక నినాదాలతో పశ్చిమగోదావరి జిల్లా ఐతంపూడిలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పెనుగొండ వాసవీమాత ఆలయం నుంచి 30రోజు పాదయాత్ర ప్రారంభించిన అమరావతి రైతులు... ఆచంట నియోజకవర్గం నుంచి తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో పాదయాత్ర ఐతంపూడి వద్దకు చేరుకోగానే.. పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణుల యత్నించాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు, నల్లజెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు. రోడ్డకు ఒకవైపున వరుసగా నిలుచుని రైతుల్ని అడ్డుకోబోయేందుకు వైకాపా శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు.

అసెంబ్లీ రద్దు చేసి మూడు రాజధానుల అజెండాతో సీఎం జగన్‌ ఎన్నికలకు రావాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. రైతలతో కలిసి మహాపాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు రైతులపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపలేరన్నారు.

పాదయాత్రలో టెన్షన్​.. అమరావతికి వ్యతిరేకంగా వైకాపా ప్లకార్డులు

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.