Tdp MLA Balakrishna comments on NTR centenary celebration: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ.. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో బీసీలకు, మహిళలకు, తెలుగు భాషకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు విజన్.. ఈనాడు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించిన బాలకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Kanna In Mahanadu: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ
ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనుడు ఎన్టీఆర్.. రాజమహేంద్రవరంలో జరుగుతున్న రెండవ రోజు మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..'' ఆనాడు ఇదే రాజమహేంద్రవరంలో తెలుగువారికి మొదటి కావ్యాన్ని అందించాలని ఆంధ్రభారత సంహిత రచనుడయ్యాడు నన్నయ గారు. అటువంటి ప్రశస్తమైన ప్రాంగణంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతిని జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఎటు చూసినా పసుపు మయం చేసినా కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. చంద్రబాబు విజన్.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమైంది. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. బాదుడే బాదుడు పేరుతో అన్ని వస్తువుల ధరలు పెంచారు. 3 రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదు. తెలుగువారి కలల రాజధాని అమరావతిని పక్కనపెట్టారు.'' అని ఆయన అన్నారు.
TDP Mahanadu: మహానాడులో మహా తీర్మానాలు.. యువతకే ప్రాధాన్యం అంటూ..!
ఆ ఆశయాలు ఉన్నవారే మహానుభావులవుతారు.. మహత్తర ఆశయాలు, ఆచారాలు, మహోన్నత భావాలు కలిగినవారే మహానుభావులు అవుతారని హిందూపురం బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అటువంటి ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం తన తండ్రి ఎన్టీఆర్ సొంతమని అన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు ప్రతిరూపం, గ్రంథాలయమని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్.. ప్రజల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించారన్నారు. పాలనా పరంగా ఆయన (ఎన్టీఆర్) ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సినిమా పరంగా నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనని వివరించారు. తాను ఒక తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది కూడా ఎన్టీఆరేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్.. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్నారు. ఆయన (ఎన్టీఆర్) గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత చెప్పిన తనివి తీరదని ఆయన వెల్లడించారు. చివరగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిజాయితీతో, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగుతుందని బాలకృష్ణ వెల్లడించారు.