Chandrababu sensational comments on CM Jagan: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు అని ఆరోపించారు. వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని సీబీఐ చెప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. వివేకా హత్యలో ప్రతి విషయం జగన్‌కు తెలిసే జరిగిందని కోర్టులో సీబీఐ చెప్పిందన్న చంద్రబాబు.. సీబీఐ వ్యాఖ్యలపై జగన్ మోహన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలి..? అని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నేటి నుంచి రెండు రోజులపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రోజు వేడుకలు వందలాది మంది కార్యకర్తల మధ్య అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్య నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు. వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని సీబీఐ చెప్పింది. వివేకా హత్యలో ప్రతి విషయం జగన్‌కు తెలిసే జరిగిందని సీబీఐ చెప్పింది. సీబీఐ వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలి?. వైఎస్ వివేకా హత్యా నేరాన్ని నాపై మోపారు. సాక్షాత్తూ బాబాయిని చంపారని సీబీఐ అంతఃపుర మిస్టరీ బయటపెట్టింది. హత్య చేసిన వ్యక్తి, చేయించిన వ్యక్తి రాజకీయాల్లో ఉండొచ్చా..?. హత్యలు చేయించే వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. హత్య గురించి ఎవరికీ తెలియకముందే జగన్‌కు తెలుసని సీబీఐ చెప్పింది. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది..?. దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలకు జగన్ జవాబు చెప్పాలి..?. హత్యకు ముందు, తర్వాత నిందితులు అవినాష్ ఇంట్లోనే ఉన్నారు. వివేకానందా రెడ్డి హత్య కేసు విషయాలన్నీ అవినాష్ ప్రతి నిమిషం జగన్‌కు వివరించాడు.'' అని ఆయన అన్నారు.
Nara Lokesh Chit Chat: అలాంటి వారు పార్టీకి అవసరం లేదు.. మహానాడు వేదికగా యువతకు శుభవార్త
అంతేకాకుండా సీఎం జగన్ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. 2019లో ఏపీ ఆదాయం రూ. 66,786 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్రానిది రూ. 69,620 కోట్లు అని ఆయన వ్యాఖ్యానించారు.
CBN COMMENTS: వివేకా హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం: చంద్రబాబు