ఉపాధ్యాయుల నుంచి ఎమ్మెల్సీ ఉంటే ప్రజలకు ఉపయోగకరమైన శాసనాలు, చట్టాలు తయారుచేయటంలో భాగస్వాములు అవుతారని.. రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యనారాయణ తెలిపారు. జాతీయ, దేశీయ భావజాలం కలిగిన సంస్థ తనను అభ్యర్థిగా ఎంపిక చేయటంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన విద్యావిధానం అమలులోకి తీసుకొస్తున్న కీలక సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగటం ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. తన పోటీకి అనేక ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించారు. తాను గెలిస్తే ఉపాధ్యాయ వర్గాలకు చేసే సేవల గురించి మేనిఫెస్టోలో పొందుపరచానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...