విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. పశ్చిమగోదావరిజిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తెదేపా నాయకులు ప్లకార్డులతో రోడ్లపై తిరుగుతూ నిరసన తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ భీమవరంలో ఆందోళన చేపట్టారు. పాలకొల్లు, ఉండి ఎమ్యెల్యేలు రామానాయుడు, మంతెన రామరాజులు నిరసన దీక్ష చేశారు. ఉంగటూరు, నిడదవోలు, తణుకు, నరసాపురంలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని వారు నినాదాలు చేశారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని తెదేపా నేతలు మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 'వలస' కష్టాలపై ఏం చేశారు?'