పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను రైతుసంఘం భవనంలో నిడదవోలు నియోజకవర్గ తెదేపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు కీలకమని.. తెదేపాకు సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. జగన్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైకాపా పాలనలో గ్రామాలన్నీ సమస్యల మయంగా మారాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: గృహనిర్మాణ పథకం ఉద్యోగులతో మంత్రి చెరుకువాడ సమీక్ష