'ఇలాంటి చర్యలతో ప్రజా పోరాటాలు ఆగవు' - చింతలపూడిలో తెదేపా నేతల గృహ నిర్బంధం న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఐకాస పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలువురి నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెదేపా కన్వీనర్ కర్రా రాజారావు మాట్లాడారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజా పోరాటాలు ఆగవని తెలిపారు.