పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురం, శివపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పేద కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రోత్సాహంతో నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో సుమారు 13 వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా విపత్తు సమయంలో పేదవారికి తమ వంతు సాయంగా అందజేసినట్లు పార్టీ మండల నాయకుడు అల్తి సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి