ప్రజా సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చెయ్యడం అన్యాయమని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి సైకిల్ మీద వెళ్తుండగా ఆయన్ను భీమవరంలో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను ఇంటి వద్ద విడిచి పెట్టారు. ఆక్వా, వరి రైతుల సమస్యల పరిష్కారం కోసం తన నివాసం వద్దే 24 గంటల నిరాహార దీక్షకు ఆయన కూర్చున్నారు. ఈ విషయంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు స్పందించారు. ఈ అరెస్టు.. ఆక్వా రైతులను అవమానించడమే అని తేల్చి చెప్పారు. కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులను ఆదుకోవాలన్నారు.
ఇదీ చూడండి: