ETV Bharat / sports

436రోజుల తర్వాత స్వదేశంలో టీమ్ఇండియా ఓటమి- ఈ ఐదు కారణాల వల్లే! - IND VS ENG T20 SERIES 2025

స్వదేశంలో జరిగిన మూడో టీ20లో ఓటమి - 14 నెలల తర్వాత భారత్​కు అదే పరిస్థితి - ఈ ఐదు కారణాల వల్లే!

ind vs eng t20 series 2025
ind vs eng t20 series 2025 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 29, 2025, 1:13 PM IST

రాజ్​కోట్‌ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టుపై ఇంగ్లాండ్‌ 26 పరుగుల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ ఇంగ్లిష్ జట్టు వశమైంది. అయితే భారత జట్టు సుమారు 426 రోజుల తర్వాత స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్​లో ఓటమి చవిచూసింది. అంతకుముందు 2023 నవంబర్ 28న గువాహటిలో జరిగిన టీ20 మ్యాచ్​లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో భారత్​ను ఓడించింది. అయితే ఈ స్టోరీలో మూడో టీ20లో టీమ్ ఇండియా ఓటమికి గల ఐదు కారణాలను తెలుసుకుందాం.

షమీ పేలవ ఫామ్​
టీమ్​ఇండియా పేసర్ షమీ 436 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మూడో టీ20లో అర్ష్​దీప్ సింగ్ స్థానంలో షమీ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నాడు. అయితే తన ఇన్నింగ్స్​లో అద్భుతాలు సృష్టించడంలో విఫలమయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 25 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత రెండు మ్యాచ్​ల్లో ప్రారంభ ఓవర్లలో అర్ష్​దీప్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడిని పెంచడంలో సఫలమయ్యాడు.

సంజు విఫలం
ఇంగ్లాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో వరుసగా మూడో మ్యాచ్​లో సంజూ శాంసన్ విఫలమయ్యాడు. మళ్లీ జోఫ్రా ఆర్చర్​కే వికెట్ సమర్పించుకున్నాడు. గత రెండు మ్యాచ్​ల్లోనూ ఆర్చర్ ఓవర్లోనే శాంసన్ పెవిలియన్​కు చేరాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శాంసన్(3) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. జట్టుకు గొప్ప ఆరంభం అందించడంలో విఫలమయ్యాడు. ఇది కూడా టీమ్ ఇండియా ఓటమికి ఓ కారణమైందని విశ్లేషకుల మాట.

సూర్యకుమార్ యాదవ్ బ్యాడ్ ఫామ్
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో రాజ్​కోట్‌ లోనూ కొనసాగింది. మొదటి రెండు టీ20ల్లో స్వల్ప స్కోర్లకే ఔట్ అయిన సూర్య, మూడో టీ20లోనూ నిరాశపరిచాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 14 పరుగుల వద్ద ఔటై పెవిలియన్ బాట పట్టాడు.

వాషింగ్టన్ సుందర్ నో మ్యాజిక్
ఆల్​రౌండర్ కోటాలో ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ మూడో టీ20లో విఫలమయ్యాడు. బ్యాట్, బాల్​తో రాణించడంలో ఫెయిల్ అయ్యాడు. సుందర్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే బ్యాటింగ్​లోనూ నిరాశపరిచాడు. ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్ కంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చి 15 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. సుందర్ ఆడిన డాట్ బాల్స్ కారణంగా రన్ రేట్ మరింత పెరిగిపోయి బ్యాటర్లపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది.

లెఫ్ట్- రైట్ కాంబినేషన్
అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కూడా టీమ్ ఇండియా ఓటమి కారణమైంది. మూడో టీ20ల్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌ లో మార్పులు వచ్చి పరుగులు చేయడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. శాంసన్ ఔటైన తర్వాత తిలక్ వర్మ రావాల్సి ఉంది. అయితే సూర్య బ్యాటింగ్‌కు వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన తిలక్ వర్మ 18 పరుగులకే వెనుదిరిగాడు. అలాగే ధ్రువ్ జురెల్ స్థానంలో సుందర్ ఆరో ప్లేస్​లో పంపగా, అతడు కూడా విఫలమయ్యాడు.

టీ20ల్లో ఆర్​సీబీ ప్లేయర్ ఫెయిల్​ - మూడు మ్యాచ్​లకు 9 రన్స్ - సింగిల్ డిజిట్​తో నెట్టుకొస్తున్న రూ. 11 కోట్ల​ స్టార్

5 వికెట్లు తీసినా నో యూజ్ - మూడో టీ20లో భారత్‌ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.