ETV Bharat / state

అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా? - PEDDIREDDY LAND GRABS MANGALAMPETA

అటవీ భూమిలో వ్యవసాయ క్షేత్రం - మధ్యలో రాజ భవనం - విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం

Peddireddy Land Grabs Chittoor District
Peddireddy Land Grabs Chittoor District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 2:12 PM IST

Peddireddy Land Grabs in Mangalampeta : కోడి గుడ్లు పెట్టినట్లు, మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజురోజుకూ పెరగడం ఎక్కడైనా చూశారా? అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ భూమి రోజురోజుకూ పెరుగుతోంది. నమ్మకశక్యం కావడం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి.

అటవిశాఖ మంత్రిని నేనే, నన్ను ఎవరు ప్రశ్నించే వారెవరు? అని అనుకున్నారో ఏమో? దట్టమైన అటవీ ప్రాంతం. మధ్యలో నున్నటి బీటీ రోడ్డు. ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు, పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం. అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా ఎవరిదంటారా? ఫ్యూడలిస్ట్ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యంలో ఓ భాగం.

ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా సవాలక్ష అనుమతులు కావాలి. కానీ ఎకరాలకొద్దీ అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి, దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి, విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి! అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీభూమిలో రోడ్డు కూడా వేశారు! ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైఎస్సార్సీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ భారత్ - ఈనాడు పరిశీలించాయి.

Peddireddy Land Grabs in Chittoor : అసైన్డ్, అటవీ భూముల్ని ఆక్రమించి రాజ భవనాలు కట్టుకోవడం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి కాలం నుంచీ వారికి అలవాటే. ఇడుపాయలయలో వందల ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్‌రెడ్డి వివాదం రేగడంతో వాటిని తిరిగిచ్చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడినీ, గుడిలో లింగాన్నీ కలిపి మింగడంలో నిష్ణాతులైన వైఎస్సార్సీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న.

ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి ప్రకృతి వనరుల్ని చెరబట్టి, వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆయన కుటుంబ అరాచకాలకు అంతే లేదు. జగన్‌ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీశాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్‌ కమిటీ నిధులతో తారు రోడ్డు వేసుకున్నారు.

Peddireddy Faimly Lands Encroachment :మంగళంపేట అడవిలోని సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వే నంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్‌ అడంగల్, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ -ఎఫ్‌ఎంబీలో స్పష్టంగా రికార్డయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్‌ ఉన్నట్టు 1952లో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే అరుదు. ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశే లేదు.

కానీ మంగళంపేట అడవిలో భూమి పెరిగింది. రెండు సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న 17.69 ఎకరాలతో మరో 6 ఎకరాలు కలిపితే 23.69 ఎకరాలు అవుతుంది. అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్‌రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములురెడ్డి, మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలు అయిందన్నమాట.

ఈ గ్రోత్‌స్టోరీ అంతటితో ఆగలేదు. అడంగల్‌లో 295/1ఏ, 295/1బి, 295/1సి, 295/1డి, 296/1, 296/1బి సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరిట 75.75 ఎకరాలు ఉన్నట్టు నమోదైంది. అంటే 45.8 ఎకరాల భూమి 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట. 295/1ఈ సర్వే నెంబర్‌లోని మరో 1.8 ఎకరాల్ని అడంగల్‌లో డమ్మీగా చూపించారు. ఈ భూమే కాకుండా ఇంకో 30 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలు ఉన్నాయి.

అదేమైనా మీ జాగీరా! : పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందో అటవీ, రెవెన్యూశాఖల దగ్గర కూడా కచ్చితమైన లెక్కలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకూ సాహసించలేదు. ఇప్పటికైనా లెక్కలు తేలాలంటే రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే చేయాలి. 295, 296 సర్వే నంబర్లను ఎప్పుడు సబ్‌డివిజన్‌ చేశారు?, పెద్దిరెడ్డి కుటుంబం పేరిట అదనపు భూమి ఎప్పుడు ఎక్కించారు?, ఎవరు సహకరించారన్నది నిగ్గుతేల్చాలి.

295, 296 సర్వే నంబర్లలో ఎఫ్‌ఎంబీ, ఫెయిర్‌ అడంగల్‌ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేశారో తేలాలి. అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అటవీ భూమిని ఆక్రమించి పట్టా భూమిలో కలిపేసుకున్నారా? రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారా అనే విషయాలూ బయటికి రావాలి. 295/1ఏలో మిథున్‌రెడ్డి పేరిట 2009 జులై 1న 10 ఎకరాల్ని ఆన్‌లైన్‌ చేశారు. 2017 అక్టోబర్ 24న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట మార్చేటప్పుడు 10 ఎకరాల భూమి 15 ఎకరాలు అయిపోయింది.

295/1సి సర్వే నెంబర్‌లో ఎన్.షంషుద్దీన్‌ పేరిట ఉన్న 15 ఎకరాల్ని 2010 జులై 1న పి.లక్ష్మణరెడ్డి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అది 2015 మే 26న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2017 అక్టోబర్ 24న మిథున్‌రెడ్డి పేరుతోనూ మారిపోయింది. ఈసారి 15 ఎకరాల భూమి 21 ఎకరాలకు పెరిగింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్‌లైన్‌లో అదనంగా ఎక్కించుకున్న భూములతోపాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు నిఘా విభాగం చెబుతోంది. అంటే అక్కడ ఆ ఫ్యామిలీకి 100 ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కలు వేసింది.

నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం : 1952 నాటి సర్వే ప్రకారం తయారుచేసిన గ్రామ పటం, శాటిలైట్‌ మ్యాపులు చూస్తే రెండు సర్వే నంబర్లలోని భూమి ఊరికి దగ్గరగా ఉంది. కానీ పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంలో ఉంది. అంటే 295, 296 సర్వే నంబర్లలోనే ఆయన వ్యవసాయ క్షేత్రం ఉందా? లేక పెద్దిరెడ్డి కుటుంబం మరోచోట అటవీ భూమి అక్రమించి వ్యవసాయ క్షేత్రం నిర్మించిందా అనే అనుమానాలూ ఉన్నాయి. ఈ గుట్టు తేలాలంటే లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.

ఇక రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగేచోట భారీ ఇనుపకంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. అడవికి సమీపానున్న పొలాల్లోకి వెళ్తున్న ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక్కడ పులుల సంచారమూ ఉంది. గతంలో పెద్దిరెడ్డి పొలంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వ్యవసాయ క్షేత్రంలోనే భారీ షెడ్లు వేసి 300 నుంచి 400 ఆవుల్ని కూడా పెంచుతున్నారు. ఎఫ్​ఎమ్​బీ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, అడంగళ్లలో వ్యత్యాసాలపై పెద్దిరెడ్డి వివరణ కోసం ఈటీవీ భారత్ - ఈనాడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి ఒకప్పుడు సన్నని కాలిబాట ఉండేది. అప్పుడప్పుడూ ఎడ్లబండ్లు మాత్రం వెళ్లేవి. కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్‌ యార్డు నిధులతో తారు రోడ్డు వేశారు. పదవిలో ఉండగా ఎస్టేట్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉండేది. భారత్‌ - పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్నామా అన్నట్లు అడుగడుగునా నిఘా ఉండేది. అటువైపు చీమను కూడా చొరబడనిచ్చేవారు కాదు. పండగలు, ఇతర సందర్భాల్లో పెద్దిరెడ్డి అక్కడికి వచ్చి వెళుతుంటారని సమాచారం. ఎవరైనా పొరపాటున ఎస్టేట్‌ దారిలో వెళ్తే అడ్డుకుని సవాలక్ష ప్రశ్నలు వేసేవారు.

మా భూములు ఆక్రమించి మాపైనే కేసులు పెట్టారు: పెద్దిరెడ్డి బాధితుల ఆవేదన - PEDDIREDDY VICTIMS

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దహనం వెనక పెద్దిరెడ్డి పాత్ర! - Madanapalle Sub Collector Office

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.