ETV Bharat / bharat

చెత్త డబ్బాల వల్లే అదంతా: కుంభమేళా తొక్కిసలాటపై ప్రత్యక్ష సాక్షులు - STAMPEDE AT KUMBH MELA 2025

చెత్త డబ్బాల వల్లే త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాట!- చీకట్లో కనిపించక చెత్త డబ్బాలు తగిలి కిందపడ్డ భక్తజనం!- పదుల సంఖ్యలో మృతి!- స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని, సీఎం

Kumbh Mela 2025 Stampede
Kumbh Mela 2025 Stampede (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 1:26 PM IST

Kumbh Mela 2025 Stampede : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయపడ్డారు. తొక్కిసలాటపై కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు. చీకట్లో కన్పించని చెత్త బుట్టలు కాళ్లకు తగలడం వల్ల చాలామంది కింద పడిపోయారని చెప్పారు.

'మౌని అమావాస్య కావడం వల్ల బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో త్రివేణి సంగమానికి చేరుకున్నారు. తలపై పెద్దపెద్ద లగేజీలతో భక్తులు వచ్చారు. అయితే పుణ్యస్నానాలు చేయడానికి ఎటువైపు వెళ్లాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. భక్తుల సౌకర్యార్ధం త్రివేణీ సంగమం పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటుచేశారు. చీకట్లో అవి భక్తులకు కనిపించలేదు. దీంతో ఆ చెత్తడబ్బాలు తగిలి చాలా మంది కిందపడ్డారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది' అని పలువురు ప్రత్యక్ష సాక్షులు ఒక సోషల్‌ మీడియా కంటెంట్ క్రియేటర్‌‌కు చెప్పారు.

Kumbh Mela 2025 Stampede
తొక్కిసలాట జరిగిన ప్రాంతం (Associated Press)

చెత్త డబ్బా తగిలి తాను కూడా కింద పడ్డానని, ఏదో ఒక విధంగా అక్కడి నుంచి కుటుంబంతో సహా బయటకు వచ్చానని మరో ప్రత్యక్ష సాక్షి వివరించాడు. వేరే భక్తులను కాపాడే క్రమంలో స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిపాడు. రామ్‌సింగ్‌ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ 'తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో జనం నిండిపోయారు. దీంతో ఎటు వెళ్లాలో ఎవరికీ అర్థం కాలేదు. ఈ క్రమంలో కొందరు నా కళ్ల ముందే స్పృహ తప్పి కిందపడ్డారు. చెత్త డబ్బాలు తగిలి ఇంకొందరు కిందపడ్డారు' అని చెప్పాడు.

పదుల సంఖ్యలో భక్తుల మృతి ?
భక్తులంతా త్రివేణీ సంగమం ప్రధాన ఘాట్‌ వద్దే స్నానం చేసేందుకు యత్నించడం వల్ల ఆ మార్గంలోని బ్యారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయాల పాలయ్యారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద కాసేపు పుణ్య స్నానాలను ఆపేసి, ఆ తర్వాత పునరుద్ధరించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా మొదలయ్యాక ఇప్పటివరకు 20 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.

Kumbh Mela 2025 Stampede
భారీగా వచ్చిన భక్తులు (Associated Press)

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు సహాయసహకారాలను అందించేందుకు యూపీ ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మోదీ తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగితో మాట్లాడి, వివరాలన్నీ తెలుసుకున్నట్లు చెప్పారు. బాధిత భక్తులకు సహాయం అందించే విషయంలో యూపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నామని అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి అదుపులో ఉంది : సీఎం యోగి
త్రివేణీ సంగమంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు సీఎం యోగి కీలక సూచన చేశారు. భక్తులంతా సంగమంలోని ప్రధాన ఘాట్ వద్దే పుణ్యస్నానానికి పోటీ పడొద్దని కోరారు. వారికి సమీపంలో ఏ ఘాట్ ఉంటే ఆ ఘాట్‌లో పుణ్యస్నానాలు చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలోని ప్రధాన ఘాట్ వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. బుధవారం దాదాపు 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్​రాజ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 'ప్రధాని మోదీ నాకు నాలుగు సార్లు ఫోన్ చేసి తొక్కిసలాట ఘటనపై ఆరాతీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయమని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌లు కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు' అని యోగి తెలిపారు.

'భక్తుల తొందరపాటు వల్లే ఇలాంటి ఘటనలు'
తొక్కిసలాట ఘటనపై ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ విచారం వ్యక్తం చేశారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం తోపులాటకు దిగొద్దని భక్తులకు సూచించారు. సంయమనంతో, ఓపికగా పుణ్యస్నానాలు చేయాలని వారిని కోరారు. భక్తులు తొందరపాటు వైఖరితో వ్యవహరించడం వల్లే తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతుంటాయని శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళా లాంటి అతిపెద్ద ఘట్టానికి హాజరయ్యే భక్తులకు తప్పకుండా ఓపిక ఉండాల్సిందేనన్నారు. దీనిపై భక్తులంతా అవగాహనకు రావాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.