ETV Bharat / state

మూడు రాజధానుల బిల్లు ఆమోదంపై వైకాపా శ్రేణుల సంబరాలు

మూడు రాజధానుల బిల్లును ఆమోదం పొందటంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాలుర ఉన్నత పాఠశాల వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మూడు రాజధానుల బిల్లు ఆమోదంపై తణుకులో వైకాపా శ్రేణులు సంబరాలు

author img

By

Published : Jul 31, 2020, 10:53 PM IST

మూడు రాజధానుల బిల్లును ఆమోదించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. తొలుత బాలుర ఉన్నత పాఠశాల వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృధ్ధిని అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలనే దుర్భుద్దితో ఒకేచోట రాజధాని నిర్మాణాలను ప్రారంభించారని నాయకులు పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తే శాసనమండలిలో సైతం బిల్లును ఆమోదించలేదని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలని భావించి గవర్నరు ఆమోద ముద్ర వేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ఒక రాజధాని కట్టలేని వారు.. 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.