ETV Bharat / state

రీస్టార్ట్‌ ఏపీ - 85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ - APPROVES RS 85083 CR INVESTMENTS

రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగు - 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదముద్ర - 33,966 మందికి ఉపాధి

Government Approves Rs.85,083 Cr Investments In AP
Government Approves Rs.85,083 Cr Investments In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 10:37 AM IST

Government Approves Rs.85,083 Cr Investments In AP : రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసింది. రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులతో మొదటి అడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB)తొలి సమావేశం ఇందుకు వేదికైంది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ.85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 33,966 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సహకాలు అందిస్తుంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

  • ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్‌ ప్లాంట్, దానికి అనుబంధంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోరు అభివృద్ధికి మిత్తల్‌ సంస్థ ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్‌ పోర్టు అభివృద్ధికి సంస్థ రూ.61,780 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వాటి ద్వారా సుమారు 21 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొదటి దశ పనులను 2029 నాటికి సంస్థ పూర్తి చేస్తుందని చెప్పింది.
  • భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్‌ సిస్టం లిమిటెడ్‌ (కేఎస్‌ఎస్‌ఎల్‌) రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ తయారైన మందుగుండు సామగ్రిని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దీనికోసం మొదటి దశలో రూ.1,430 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వాటి ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర దగ్గర ఏపీఐఐసీ భూములను ఈ పరిశ్రమకు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన తర్వాత ఆ సంస్థ ఉన్నతాధికారులను గత ప్రభుత్వం కేసులు పెట్టి, అరెస్టులు చేసింది. దక్షిణ కొరియా నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో రూ.5,001 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. వాటి ద్వారా 1,495 మంది ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
  • ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ రూ. 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టి 200 మందికి ఉపాధి చూపనుంది.
  • ఆజాద్‌ ఇండియా మొబిలిటీ లిమిటెడ్‌ రూ.1,046 కోట్ల పెట్టుబడులతో 2,381 మందికి ఉపాధి కల్పించనుంది.
  • ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 76 కోట్లు పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేసి, 250 మందికి ఉపాధి అందించనుంది.
  • డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ ఎల్‌ఎల్‌పీ రూ. 50 కోట్ల పెట్టుబడులతో 2 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇంధన రంగంలో రూ.11,902 కోట్ల పెట్టుబడులు

  • ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా రూ.8,240 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,800 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ) ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేసి, సుమారు 4 వేల మందికి ఉపాధి కల్పిస్తారని తెలిపింది.
  • కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో, అదనంగా 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 1,725 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది.
  • ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,662 కోట్ల పెట్టుబడులతో 277 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. వాటి ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది.

పెట్టుబడులతో వచ్చేవారిని గౌరవిద్దాం: చంద్రబాబు

దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆ పోటీని తట్టుకుని ఏపీకి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి గౌరవం ఇవ్వాలి. వారికి అధికారులు అన్ని రకాలుగా సహకరించాలి. ‘ఆర్సెలార్‌ మిత్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద పెద్ద పరిశ్రమలకు మూడు పద్ధతుల్లో భూసేకరణ చేపట్టాలి. రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూసమీకరణ విధానాన్ని ప్రజల ముందుంచాలి.

రెండో ఆప్షన్‌ కింద భూములిచ్చే వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదంటే అత్యుత్తమ ప్యాకేజీ ద్వారా భూసేకరణ చేపట్టాలి. పెట్టుబడులు ఎంత ముఖ్యమో భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్‌ కూడా అంతే ముఖ్యం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్​తో సీఎం భేటీ

లక్షన్నర కోట్ల పెట్టుబడి - 63వేల ఉద్యోగావకాశాలు - ఏపీలో ఆర్సెలార్‌ మిత్తల్ స్టీల్ ప్లాంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.