కరోనా నియంత్రణ చర్యలపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ విజృంభణ తీరును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అధికారులు కొవిడ్ నియంత్రణకు ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం కేసులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. వైద్యులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినట్లయితే వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
ఇదీ చదవండి: