వైకాపా ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఖండించారు. తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోయినా పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇసుక దోపిడీ చేసినా కనీసం విమర్శించని పవన్‌కళ్యాణ్... ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై పుస్తకం విడుదల చేయడం దారుణమన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయినా... విమర్శించే ధోరణి మంచిదికాదని హితవుపలికారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే నేతలు ఓపికపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి