పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇరగవరం మండలం ఐతంపూడిలో 'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. పలుచోట్ల మహిళలు ఆయనకు హారతులు పట్టారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషిగా నిలిచిపోయారని అభినందించారు.
ఇదీ చదవండి