Tanuku MLA on Rebels : ప్రజలకు నేను మంచి చేయాలని చూస్తుంటే.. పార్టీలోని కొందరు దుష్టశక్తులు మాదిరిగా నాకు వెన్నుపోటు పొడుస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఒక వ్యక్తి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే దూరంగా పెట్టామని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే దాన్ని కులాలకు ఆపాదించి చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంతోమంది దూషిస్తున్నట్లు నా సహచరులు చెప్పినప్పటికీ.. నేను స్వయంగా విన్నప్పుడే స్పందిస్తానని కారుమూరి వివరించారు.
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, దుష్టశక్తులు అడ్డుపడినా, తానెప్పుడూ ప్రజల మనిషినేనని, ప్రజలకు మంచి జరిగేలా వారిలో ఒకరిగా పని చేస్తానని ఎమ్మెల్యే కారుమూరి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
Bhogapuram: సంక్రాంతి తర్వాత గ్రామాలు ఖాళీ చేయాలంటున్న అధికారులు.. ససేమిరా అంటున్న గ్రామస్థులు