మున్సిపల్ ఎన్నికలలో వైకాపాను గెలిపించాలని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యేకు కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని బీసీ కమ్యూనిటీ హాల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నాయకులు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఎవరూ ఆధిపత్యం చెలాయించడానికి రారని, పట్టణ ప్రాంతంలో అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలకు మద్దతు ఇవ్వడానికి మాత్రం వస్తున్నారని చెప్పారు.
పట్టణ, గ్రామీణ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తణుకు పట్టణం అంతా వైకాపా జెండా ఎగిరేలా చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదీ చూడండి.