ETV Bharat / state

'కరోనా ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం' - తణుకు మాజీ ఎమ్మెల్యే తాజా వార్తలు

కరోనా అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖలు, తదితర సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

tanuku ex mla talks on government taking measures on corona
తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
author img

By

Published : Jul 25, 2020, 5:28 PM IST

కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్​గా ఉన్న వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖలు, పారిశుద్ధ్య కార్మికులు తదితర సిబ్బందికి ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖల అధికారుల సిబ్బందితో పాటుగా ఎనలేని కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు.

కరోనా నియంత్రణంలో ప్రభుత్వం విఫలమైందని... ముఖ్యమంత్రితో సహా వైకాపా నాయకులు ఈ విషయాన్ని చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం సీఎం జగన్​ మాస్కు ధరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా విషయంలో పేద బడుగు వర్గాలను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారని ఆయన విమర్శించారు. వైకాపా నాయకులు మాత్రం తమకు కరోనా వస్తే ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి :

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: ఆరిమిల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.