ETV Bharat / state

సర్వాంగ సుందరంగా ఏపీ నిట్‌ - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.210 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థ జిల్లాకు తలమానికంగా నిలుస్తోంది.

nit
nit
author img

By

Published : May 18, 2021, 7:13 PM IST

nit
nit

నిట్‌ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫేజ్‌ వన్‌ బి కింద రూ.210 కోట్లతో వివిధ రకాల భవన నిర్మాణాలను గతేడాది చేపట్టగా ఆయా నిర్మాణాలు ప్రస్తుతం చివరి దశకు చేరుకుని అబ్బురపరుస్తున్నాయి. ప్రాంగణంలోని డివైడర్లపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రిళ్లు మిరుమిట్లుగొలుపుతూ జాతీయ రహదారిపైగా రాకపోకలు సాగించే వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థ జిల్లాకు తలమానికంగా నిలుస్తోంది.

buildings
పరిపాలన భవనం

పూర్తయిన భవనాలు

నిట్‌ ఫేజ్‌-1 బి భవనాల నిర్మాణాలకు సంబంధించి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్సు డిపార్ట్‌మెంట్‌ గతంలో టెండర్లు పిలవగా పుణేకు చెందిన బీజీ షీర్కే కంపెనీ దక్కించుకుంది. ఇందులో పరిపాలన భవనం, గ్రంథాలయం, అకడమిక్‌ భవనం, ఏసీ ప్లాంట్‌, వసతిగృహాలు, భోజనశాల, ప్రయోగశాల వంటివి ఉన్నాయి. ఆయా భవనాలను 5 లక్షల అడుగుల విస్తీర్ణంలో ప్రీక్యాస్టింగ్‌ పద్ధతిలో 13 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా కొవిడ్‌ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం భవన నిర్మాణాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి. కొన్నింటికి రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లేందుకు వీలుగా ప్రాంగణంలో అంతర్గత సీసీ రహదారులను తీర్చిదిద్దారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేందుకు భూగర్భ కాలువ వ్యవస్థను నిర్మించారు. భవనాల మధ్య ఆహ్లాదాన్నిచ్చే వివిధ రకాల మొక్కలను, ఉద్యాన వనాలను తీర్చిదిద్దారు. సంస్థ ముఖద్వారం నుంచి బాలికల వసతిగృహం వరకూ రన్‌వే మధ్యన డివైడర్​ని తీర్చిదిద్దారు. ఇందులో ఎల్‌ఈడీ దీపాలతో ఉన్న విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆయా దీపాలు రాత్రిళ్లు పున్నమి నాటి వెన్నెలను తలపిస్తున్నాయి. ఫేజ్‌ వన్‌ ఏ కింద 5.50 లక్షల అడుగుల విస్తీర్ణంలో గతంలో రూ.206 కోట్లతో విద్యార్థులకు అనువుగా వివిధ రకాల భవన సముదాయాలను నిర్మించారు.

రెండో గేటు

సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు పట్టణంలోకి వచ్చేందుకు ఇప్పటి వరకు ప్రధాన ద్వారం ఒక్కటే ఉంది. దీంతో విద్యార్థులు ఏమైనా వస్తువులు కొనుగోలుకు పట్టణంలోకి వచ్చినవారు తిరిగి వెళ్లేందుకు, రాత్రి సమయాల్లో ఆటోలు, వాహనాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యేవారు. విద్యార్థులు ఈ సమస్యను డైరెక్టర్‌ సీఎస్ఫీరావు దృష్టికి తీసుకెళ్లగా బస్టాండ్‌ వైపున మరో గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు వర్సిటీ పడమర వైపున రెండో గేటు నిర్మాణ పనులు ప్రారంభించారు.

రూ.750 కోట్లతో రెండో దశ పనులు

సంస్థను 2015లో బీటెక్‌ కోర్సులతో ఏర్పాటు చేశారు. మొదట్లో 480 సీట్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 603కి చేరింది. ఇవి కాకుండా ఏడాది నుంచి పీహెచ్‌డీ, ఎంటెక్‌ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2026 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు (4,500 మంది) అయ్యే అవకాశాలుండటంతో వారందరికీ అనువుగా ఉండేందుకు రూ.750 కోట్లతో రెండో దశ భవనాలను నిర్మించనున్నారు. ఇందులో అకడమిక్‌ భవనం, ప్రయోగశాల, గ్రంథాలయం, బాలుర వసతిగృహం, భోజనశాల, ఇండోర్‌ స్టేడియం, ఆడిటోరియం, ఆసుపత్రి, స్టూడెంట్స్‌ యాక్టివిటీస్‌ సెంటర్‌ వంటివి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేయడంతో బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ (బీవోజీ) కూడా ఆమోదించింది. ఆయా ప్రతిపాదనలను కేంద్ర మానవ వనరుల శాఖ (కేంద్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి)కు పంపించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: గణనీయంగా తగ్గిన రైల్వే ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.