ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్(AP-NIT in tadepalligudem) ఏర్పాటు చేశారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(central minister smrithi irani) చేతుల మీదుగా నిట్ ప్రారంభమైంది. సొంత భవనాలు లేకపోవడం వల్ల రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించారు. త్వరితగతిన నిధులు విడుదల చేయడంతో పాటు వేగంగా పక్కా భవనాలు(campus buildings) నిర్మించడంతో నాలుగేళ్లకే సొంత ప్రాంగణంలోకి నిట్ తరలించారు. రూ.416కోట్లు వ్యయంతో రెండు దశల్లో భవనాలు నిర్మించారు. 30నెలల కాలంలోనే 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాంగణ నిర్మాణాలు పూర్తిచేశారు.
ఏపీ నిట్‌లో ప్రస్తుతం 1500 మంది విద్యార్థులు(students) ఉన్నారు. అతిపెద్ద ల్యాబొరేటరీ కాంప్లెక్స్‌ను(laboratory complex) నిర్మించి పలు కోర్సుల ప్రయోగాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సెంట్రల్(central), మెకానికల్(mechanical), సివిల్ ఇంజినీరింగ్ వర్క్ షాప్(civil engineering work shop)లను నిర్మించారు. 3వేల మంది విద్యార్థుల(three thousand students)కు వసతిగృహాలు(hostels), క్యాంటీన్లు(canteen) ఏర్పాటు చేశారు. నాలుగు క్రీడా మైదానాలు నిర్మించారు. ఇంకా పలు భవనాలు, ప్రయోగశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తరువాత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని నిట్ డైరెక్టర్(NIT director) వెల్లడించారు. ఏపీ నిట్(AP-NIT) అభివృద్ధి కోసం 750కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు మంజూరైతే నిట్ మరింత పురోగాభివృద్ధి సాధిస్తుంది.
అనతి కాలంలోనే అత్యంత వేగంగా ఏపీ-నిట్ అభివృద్ధి చెందింది. ఎంహెచ్ఆర్డీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. గుత్తేదార్లు, సిబ్బంది సహాయంతో పనులను వేగవంతం చేయగలిగాం. పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నందున ప్రస్తుతం తక్కువ విద్యార్థులు ఉన్నారు. భవనాల నిర్మాణం పూర్తయితే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఎంబీఏ ప్రోగ్రాం ను ప్రారంభిస్తున్నాం. నిట్‌లో విద్యనభ్యసించిన వారిలో 86శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియమాకాలకు ఎంపికయ్యారు.
సీఎస్పీ రావు, డైరెక్టర్, ఏపీ నిట్
ఇవీచదవండి.