పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతనంగా నిర్మించిన 'నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. జూమ్ యాప్ ద్వారా అంతర్జాలంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతగా 206 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు బ్లాకుల్లో నిర్మాణాలు చేప్టటారు.
సర్వేపల్లి రాధాకృష్ణ అకాడమీ సముదాయాలు, అబ్దుల్ కలాం పరిశోధనశాల, గోదావరి బాలుర వసతిగృహం, కృష్ణవేణి బాలికల వసతిగృహం, అతిథి గృహాలను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ